Header Banner

అమెరికాకు వెళ్ళనున్న వైసీపీ నేత! ఎందుకంటే?

  Sun May 18, 2025 07:45        Politics

వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని అమెరికా వెళ్లనున్నారు. కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో నాని ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ముంబాయిలో గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆ తరువాత నాని పూర్తిగా విశ్రాంతిలో ఉన్నారు. ముఖ్యమైన వారు మినహా ఎవరినీ కలవటం లేదు. మాజీ సీఎం జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నాని మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, నాని ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ నేతలు వెల్లడించారు.

 

మాజీ మంత్రి కొడాలి నాని అమెరికా వెళ్లనున్నారు. తొలుత హైదరాబాద్ లో నానికి వైద్య పరీక్ష లు చేసిన సమయంలో గుండెలో మూడు రక్త నాళాలు పూడుకుపోయినట్లు గుర్తించారు. బైపాస్ అవసరమని నిర్ధారించటంతో ప్రత్యేక విమానంలో ముంబాయికు తరలించారు. అక్కడ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలోదాదాపు 8 గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వ హించారు. సర్జరీ తరువాత పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచా రు. ఆ తరువాత నాని కోలుకోవటంతో హైదరాబాద్ వచ్చేసారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటు న్నారు. రాజకీయ వ్యవహారాలకు పూర్తి దూరంగా ఉన్నారు. మాజీ సీఎం జగన్ ఫోన్ లో నాని ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో నాని ఆరోగ్యం పైన ఆరా తీసారు. నాని కోలుకున్నట్లుగా పార్టీ నేతలు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! చంద్రబాబు కీలక ఆదేశాలు! రూ.12,500 చొప్పున..

 

హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న కొడాలి నాని పార్టీ ముఖ్య నేతలు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చారు. సర్జరీ తరువాత వైద్యుల సూచన మేరకు ఎవరినీ కలవటం లేదు. కాగా, నాని ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేసారు. అయితే, మెరుగైన చికిత్స కోసం నాని అమెరికా వెళ్లనున్నారు. గతంలోనే ఈ మేరకు ఆలోచన చేసినా.. సర్జరీ తరువాత కొంత కాలం ఆగి వెళ్లాలనే వైద్యుల సూచన మేరకు ఇప్పుడు ప్రణాళికలు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. నాని కోలుకున్నా.. కొంత కాలంగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. కాగా, నాని తిరిగి ఆరోగ్యంగా రావాలని ఆయన అభిమానులు.. పార్టీ కేడర్ పూజలు చేసింది. ప్రస్తుతం నాని కోలుకున్నారు. మరింత మెరుగైన చికిత్సతో పాటుగా విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది.


ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #YSRCP #YSRCPLeader #AndhraPolitics #APPolitics #YSRCPNews #USVisit # kodalinani